దేవుడికి కానుకగా బంగారు గుండె.. ఎందుకంటే?

6చూసినవారు
దేవుడికి కానుకగా బంగారు గుండె.. ఎందుకంటే?
రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాకు చెందిన ఒక భక్తుడు, తన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినందుకు కృతజ్ఞతగా చిత్తోర్‌గఢ్‌లోని ప్రసిద్ధ సాంవలియా సేఠ్ ఆలయంలో ప్రత్యేక కానుక సమర్పించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కోలుకుంటే బంగారు హృదయాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆపరేషన్ విజయవంతం కావడంతో, 21 గ్రాముల బరువున్న బంగారు హృదయాన్ని ఆలయ అధికారులకు అందించాడు. దీని విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని అంచనా.

సంబంధిత పోస్ట్