AP: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్నదానం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన దాత కొడాలి శ్రీకాంత్ రూ. 10 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు రూ. 10 కోట్ల విలువైన డీడీని ఆయన నేరుగా టీటీడీ అదనపు ఈవోకు సమర్పించారు. ఇంత భారీ స్థాయిలో విరాళం రావడం పట్ల దేవస్థానం అధికారులు సైతం ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు.