తుఫాన్‌గా బలపడిన తీవ్ర వాయుగుండం

47చూసినవారు
తుఫాన్‌గా బలపడిన తీవ్ర వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ సాయంత్రం ‘అక్వాన్’ తుఫాన్‌గా బలపడింది. సాయంత్రం 5.30 గంటలకు దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 17వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా, 19వ తేదీ ఉదయానికి అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఈ నెల 20న నెల్లూరు-తుని మధ్య ఏపీ, యానాం తీరాలను దాటవచ్చని అంచనా వేసింది. తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్