AP: శ్రీకాకుళం నగరంలోని వాంబే కాలనీలో సిగరెట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పాలిశెట్టి వెంకటనరసింహమూర్తి అలియాస్ రమణ (వృద్ధుడు) మద్యం మత్తులో సిగరెట్ వెలిగించి బొంతపై పెట్టి నిద్రపోయారు. దీంతో బొంతకు మంటలు అంటుకుని.. తలుపులు మూసి ఉండటంతో క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. ఈ ఘటనలో రమణతో పాటు ఇంట్లోని ద్విచక్ర వాహనం కూడా దగ్ధమయ్యాయి. తల్లిదండ్రుల మరణం, వివాహం కాకపోవడంతో ఒంటరిగా మారిన ఆయన మద్యం, సిగరెట్లకు బానిసై వాంబే కాలనీలో యాచకుడిగా జీవిస్తున్నట్లు సమాచారం.