ముసుగు వేసుకొని వచ్చి.. బంగారు నగలు ఎత్తుకెళ్లిన మహిళ (VIDEO)

2చూసినవారు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో గల సర్దార్ పీఎస్ పరిధి సుల్తాన్‌పురా ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ‘సచిన్ జ్యువెలర్స్’ షాపులోకి ముసుగు ధరించి వచ్చిన ఒక మహిళ.. సిబ్బంది కస్టమర్లతో బిజీగా ఉండగా రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాల బాక్సును దొంగిలించి పరారైంది. ఈ మొత్తం దృశ్యం షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రస్తుతం సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని పట్టుకునేందుకు విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్