అమ్మాయి కోసం తోటి స్నేహితుడిని హత్య చేసిన యువకుడు

3చూసినవారు
అమ్మాయి కోసం తోటి స్నేహితుడిని హత్య చేసిన యువకుడు
AP: తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్నేహితురాలి గురించి అనుచితంగా మాట్లాడాడన్న కోపంతో ఓ యువకుడు తన స్నేహితుడిని బండరాయితో కొట్టి హత్య చేశాడు. ఓజిలి మండలం కారూరు గ్రామానికి చెందిన బాలగోవిందు, హరి స్నేహితులు. శనివారం రాత్రి ఓ అమ్మాయి విషయంలో మద్యం సేవిస్తుండగా గొడవ తీవ్రమై.. బాలగోవిందు ముఖంపై హరి బండరాయితో బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్