ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ట్రాన్స్‌జెండర్‌ గుర్తింపు వివాదం.. అల్లుడిని కాల్చి చంపిన అత్తామామ
Sep 29, 2026, 07:09 IST/

ట్రాన్స్‌జెండర్‌ గుర్తింపు వివాదం.. అల్లుడిని కాల్చి చంపిన అత్తామామ

Sep 29, 2026, 07:09 IST
న్యూయార్క్‌ టైమ్స్‌లో పనిచేస్తున్న 40 ఏళ్ల జొనాథన్‌ మెకిన్సీని కాలిఫోర్నియాలోని డబ్లిన్‌లో ఆయన అత్తామామలు తుపాకీతో కాల్చి చంపారు. 2010లో మెకిన్సీ శస్త్రచికిత్స చేయించుకుని పురుషుడిగా మారాడు. అనంతరం క్యాండిస్‌ జాంగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అతడు ట్రాన్స్‌జెండర్‌ అన్న విషయం తెలుసుకున్న భార్య కుటుంబం దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో గతంలో వివాదం తలెత్తింది. అత్తామామలు తనను అవమానించారని మెకిన్సీ కోర్టును ఆశ్రయించారు. అయితే.. తనను వేధించేవాడని మెకిన్సీపై కూడా ఆయన భార్య ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.