
డింపుల్ హయాతికి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన దర్శకుడు సంపత్ నంది
భోగి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు సంపత్ నంది హీరోయిన్ డింపుల్ హయాతికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. సినిమాలో ఒక అద్భుతమైన పాటను చిత్రీకరిస్తానని గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినందుకు ఆయన తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో శర్వానంద్ గంగ అనే పాత్రలో నటిస్తుండగా, డింపుల్ హయాతి మందారం అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. తనలోని నటిని గుర్తించి మంచి అవకాశం కల్పించినందుకు సంపత్ నందికి డింపుల్ హయాతి ధన్యవాదాలు తెలిపారు.




