
తమిళనాడులో భారీ ప్రమాదం.. రోడ్డుపై 25 వేల లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్!
తమిళనాడులోని దిండిగల్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. తూత్తుకుడి నుంచి కరూర్ వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. అనంతరం వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొనడంతో ట్యాంకర్ వాల్వ్ దెబ్బతిని 25 వేల లీటర్ల యాసిడ్ రోడ్డుపై లీక్ అయ్యింది. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి నీటిని చల్లి యాసిడ్ తీవ్రతను తగ్గించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.




