కంపెనీ ఏజీఎంలో
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్
అదానీ తన పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. న్యూక్లియర్ పవర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే 3 ప్రధాన రంగాలపై గ్రూప్ దృష్టి సారిస్తుందని తెలిపారు. '
అదానీ అటామిక్ ఎనర్జీ' ద్వారా అణు విద్యుత్ వ్యాపారంలోకి ప్రవేశించి, 2035 నాటికి 10 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అలాగే, 2030 నాటికి 3 గిగావాట్ల డేటా సెంటర్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ ఆదాయం 7.4 శాతం పెరిగి రూ. 2.92 లక్షల కోట్లకు, లాభం 14 శాతం వృద్ధితో రూ. 46,376 కోట్లకు చేరింది.