తెలుగు రాష్ట్రాల్లో గత వారం తీవ్రంగా ఉన్న చలి ప్రభావం ప్రస్తుతం తగ్గింది. ఉదయం పూట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఎల్నినో ఎఫెక్ట్, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ సూచనల మేరకు, నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ నెల 30 తర్వాత చలి తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.