
అంబులెన్సు ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి
నిర్మల్ జిల్లాలోని సోన్-కడ్తాల్ వై జంక్షన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక రోగి, ఆమె తల్లి మృతి చెందారు. గాడిగూడ మండలం జరి గ్రామానికి చెందిన సరస్వతి (22) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆదిలాబాద్ లో చికిత్స పొందుతుంది. వైద్యులు నిజామాబాద్ కు సిఫారసు చేయడంతో ఆమె తల్లి పారూబాయి (50)తో పాటు నలుగురు బంధువులు అంబులెన్స్ లో బయల్దేరారు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న లారీ వీరి అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.






































