Sep 26, 2026, 06:09 IST/
గణేశ్ నిమజ్జనానికి డీజే అనుమతి ఇవ్వలేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
Sep 26, 2026, 06:09 IST
TG: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో శనివారం గణేశ్ నిమజ్జనానికి డీజేకు అనుమతి నిరాకరించడంతో ఆగ్రహించిన ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, యువకుడికి నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు. అనంతరం పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు.