
మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి
గుడిహత్నూర్ మండలంలో తక్కువ వర్షపాతం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవాలని, మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని కోరుతూ గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి తహసీల్దార్ కవిత రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు మోహితే మారుతి, మండల అధికార ప్రతినిధి ఆడే జైపాల్, ప్రధాన కార్యదర్శి కాగ్నే రాంకిషన్, మండల మైనార్టీ అధ్యక్షులు సమీర్ ఖాన్, మాజీ ఎంపీపీ జ్ఞానోబ, మండల కార్యదర్శి రాథోడ్ రమేష్ తోపాటు మండల రైతులు రాథోడ్ కైలాస్ , నారాయణ, ముండే దిగంబర్, జాదవ్ పురుషోత్తం, చవాన్ బలిరామ్, ముండే విష్ణుకాంత్ తదితరులు పాల్గొన్నారు.





























