
చెరువులో పడి కానిస్టేబుల్ మృతి (వీడియో)
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం దుగ్నేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కానిస్టేబుల్ సమ్మయ్య (38) గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఆయన వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

























