Sep 27, 2026, 13:09 IST/
ఆన్లైన్ షాపింగ్కు కొత్త నిబంధనలు.. జనవరి 1 నుంచి అమలు
Sep 27, 2026, 13:09 IST
ఆన్లైన్ కొనుగోలుదారుల రక్షణ, పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ‘వినియోగదారుల రక్షణ నిబంధనలు-2026’ను తీసుకువచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, అమ్మకందారులు తమ వ్యాపార వివరాలు, చిరునామా, కస్టమర్ సర్వీస్ సమాచారం, రేటింగ్స్ను తప్పనిసరిగా చూపాలి. తప్పుదోవ పట్టించే పాప్-అప్లు, ప్రకటనలు నిషేధించబడ్డాయి. కొనుగోలుదారులు తమ ఓటీపీ, పిన్లను ఎవరికీ చెప్పకూడదని సూచించారు. ఏదైనా సమస్య వస్తే, 48 గంటల్లో ఫిర్యాదుల అధికారి స్పందించాలని ఆదేశించారు. ఈ నియమాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.