మావాల మండలం - Mavala Mandal

ఆదిలాబాద్ జిల్లా
మా షరతులు అంగీకరించండి లేదంటే యుద్ధం: ఇరాన్
Sep 20, 2026, 05:09 IST/

మా షరతులు అంగీకరించండి లేదంటే యుద్ధం: ఇరాన్

Sep 20, 2026, 05:09 IST
అమెరికాతో తిరిగి చర్చలు ప్రారంభించేందుకు ఇరాన్ ఏడు షరతులను ప్రతిపాదించింది. ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ షరతులను అమెరికాకు చేరవేసినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇరాన్ ప్రతిపాదించిన షరతుల్లో యుద్ధాన్ని అన్ని రంగాల్లో ముగించడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. అమెరికా తమ షరతులను అంగీకరించకపోతే సైనికపరంగా కూడా సిద్ధంగా ఉందని రెజాయీ హెచ్చరించారు.