
సూర్యాపేటలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి (వీడియో)
TG: సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు బోడతండాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద బాలిక మృతదేహం కాలిన గాయాలతో లభ్యమైంది. గురువారం అర్ధరాత్రి కుమార్తె కోసం వెతుకుతుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి పరారైనట్లు తండ్రి పేర్కొన్నారు. ఇది హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలంలో దొరికిన బైక్ ఆధారంగా తండ్రి ఒక యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




