Sep 21, 2026, 05:09 IST/
యువతికి వీడియో కాల్ చేసి ఉరివేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
Sep 21, 2026, 05:09 IST
TG: హైదరాబాద్ మలక్‌పేటలో కానిస్టేబుల్ చంద్రశేఖర్ (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముసారాంబాగ్ శాలివాహననగర్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంబర్‌పేట హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా పనిచేస్తున్న ఆయన.. ఆదివారం అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చూపించాడు. దీంతో ఆమె చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.