కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 సంవత్సరంలో సైన్యంలో చేరిన మొదటి బ్యాచ్ అగ్నివీర్ల సర్వీసు కాలం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో ముగియనుండగా, వారిలో 75 శాతం మందికి సర్వీసు కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిపథ్ పథకంలో భాగంగా చేరిన అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.