AI ఎంట్రీ.. ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్

83చూసినవారు
AI ఎంట్రీ.. ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్
ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఆధార్ ఆధారిత సేవల్లో మోసాలను ముందుగానే గుర్తించి అడ్డుకునేందుకు UIDAI అధునాతన AI టెక్నాలజీని ఉపయోగించనుంది. ఫేక్‌ బయోమెట్రిక్స్, స్పూఫింగ్‌ను గుర్తించేలా భద్రతా వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. ప్రస్తుతం రోజుకు 10 కోట్లకు పైగా అథెంటికేషన్లు జరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో 25–30 కోట్ల లావాదేవీలను నిర్వహించేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌ SDK, శాండ్‌బాక్స్‌ను ప్రారంభించింది. వీటితో యాప్‌లలోనే సురక్షిత ఫేస్‌ అథెంటికేషన్‌, ఏఐ లైవ్‌నెస్‌ చెక్‌, యాంటీ స్పూఫింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్