
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా తొలిసారి అంగీకారం
అమెరికా అంతరిక్షంలో ఆయుధాలను మోహరించిన విషయాన్ని తొలిసారి బహిరంగంగా అంగీకరించింది. శత్రు దేశాల నుంచి తమ బలగాలను రక్షించుకోవడానికి 'ఆన్-ఆర్బిట్ స్పేస్ కంట్రోల్ వెపన్స్' అందుబాటులో ఉన్నాయని అమెరికా ఎయిర్ఫోర్స్ కార్యదర్శి ట్రాయ్ మైంక్ వెల్లడించారు. శత్రు ఉపగ్రహాలను ధ్వంసం చేసేలా లేదా వాటి సంకేతాలను అడ్డుకునేలా ఇవి పనిచేస్తాయని స్పేస్ ఫోర్స్ తెలిపింది. ఈ పరిణామం చైనా, రష్యాలతో అంతరిక్షంలో కొత్త ఆయుధ పోటీకి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




