ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


బాలికపై కరాటే శిక్షకుడి లైంగిక వేధింపులు!
Sep 03, 2026, 12:09 IST/

బాలికపై కరాటే శిక్షకుడి లైంగిక వేధింపులు!

Sep 03, 2026, 12:09 IST
ముంబైలోని ఎస్‌ఎన్‌డీటీ ఉమెన్స్‌ కాలేజీలో కరాటే ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న మహేశ్‌ నవాలేను మైనర్‌ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై కుర్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహేశ్‌ మాతుంగా, చూనాభట్టి, సియోన్‌ ప్రాంతాల్లోనూ కరాటే శిక్షణ ఇస్తుండటంతో అక్కడ కూడా బాధితులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2007 నుంచి విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ పలువురు ఆరోపణలు చేసినట్లు సమాచారం. అయితే ఆరోపణలు ఇంకా రుజువు కావాల్సి ఉంది. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పోలీసులు కోరారు.