9 నుంచి 12వ తరగతి వరకు AI పాఠాలు

22చూసినవారు
9 నుంచి 12వ తరగతి వరకు AI పాఠాలు
మారుతున్న సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం 20 గంటల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మాడ్యూల్‌ను రూపొందించినట్లు ఏప్రిల్ 9న బోర్డు ప్రకటించింది. తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, ఏఐని బాధ్యతాయుతంగా ఉపయోగించడం వంటి అంశాలను నేర్పడం దీని ఉద్దేశం. ఐఐటీ మద్రాస్, జోధ్‌పూర్ సహకారంతో ఎన్సీఈఆర్టీ ఈ మాడ్యూల్స్‌ను రూపొందించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్