సాల్మన్ చేపలను కాపాడేందుకు ఏఐ రోబోలు

41చూసినవారు
సాల్మన్ చేపలను కాపాడేందుకు ఏఐ రోబోలు
సాల్మన్ చేపల ఉత్పత్తిని దెబ్బతీస్తున్న సముద్ర పేనుల (సీ లైస్) సమస్యను అరికట్టేందుకు నార్వే వినూత్న చర్యలు చేపట్టింది. సముద్ర తీర ప్రాంతాల్లో సుమారు 3,500 లేజర్ ఆధారిత ఏఐ సబ్‌మెరైన్ రోబోలను మోహరించింది. సాల్మన్ చేపలకు ఎలాంటి హాని కలగకుండా సీ లైస్‌ను నియంత్రించడమే ఈ రోబోల లక్ష్యం. కృత్రిమ మేధస్సు సాయంతో పనిచేసే ఈ రోబోలు చేపల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్