వ్యవసాయ రంగంలో ఏఐ ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం రైతన్నల కోసం 'భారత్ విస్తార్ యాప్'ను అందించింది. ఈ యాప్ ద్వారా విత్తనాలు, సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, యాజమాన్య పద్ధతులు, పంటకు మద్దతు ధర ఎక్కడ లభిస్తుంది, మార్కెట్ సౌకర్యాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తుంది. రైతు తన పొలంలో పంటకు ఆశించిన చీడపీడ, తెగులు ఫోటో తీసి పంపితే, రోగం, వాడాల్సిన మందు, మోతాదు వంటి వివరాలు క్షణాల్లో అందుతాయి. ఏ పంట సాగు చేయాలో వాతావరణ పరిస్థితులను అంచనా వేసి నిర్ణయిస్తుంది. దీనిని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.