హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఒక ఎయిర్‌ఇండియా
విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి 109 మంది ప్రయాణికులతో ముంబయికి బయలుదేరిన ఏఐ417 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతికలోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఏటీసీకి సమాచారం అందించి, వారి సూచనల మేరకు 5 నిమిషాల్లోనే విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. ఈ ఘటనతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, సాంకేతిక బృందం విమానాన్ని పరిశీలిస్తోంది.