అమెరికాలో విమాన సర్వీసులకు అంతరాయం!

12చూసినవారు
అమెరికాలో విమాన సర్వీసులకు అంతరాయం!
అమెరికా ఈశాన్య ప్రాంతంలోని విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్ సెంటర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వందలాది విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి విదేశీ నాయకులు వస్తున్న సమయంలో ఈ సమస్య ఏర్పడింది. కమ్యూనికేషన్ వైరు తెగిపోవడంతో న్యూయార్క్ నగర ప్రాంతంలోని ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. అధికారులు గంటల తరబడి శ్రమించి కనెక్షన్‌ను పునరుద్ధరించడంతో విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

సంబంధిత పోస్ట్