భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు షాక్ ఇస్తూ, ప్లాన్ల ధరలను 3 నుంచి 10 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. అయితే, ధరల పెంపుతో పాటు ప్రతి సిమ్‌కు ఏడాదికి ఒకసారి 5 రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటా, 60 నిమిషాల కాల్స్, 25 అవుట్‌గోయింగ్ ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలతో ఉచిత అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను అందిస్తోంది. రూ.449 ప్లాన్ రూ.499కి, రూ.699 ప్లాన్ రూ.749కి, రూ.999 ప్లాన్ రూ.1,049కి పెరిగాయి.