ఎయిర్‌టెల్‌లో.. వాయిస్‌ ఓన్లీ రీఛార్జ్‌

14చూసినవారు
ఎయిర్‌టెల్‌లో.. వాయిస్‌ ఓన్లీ రీఛార్జ్‌
ట్రాయ్‌ ఆదేశాల మేరకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తాజాగా మూడు వాయిస్-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. డేటా అవసరం లేని వినియోగదారుల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్లలో రూ.185 (28 రోజులు), రూ.203 (30 రోజులు), మరియు రూ.206 (ఒక నెల వ్యాలిడిటీ) ఉన్నాయి. ఈ అన్ని ప్లాన్లలో అన్‌లిమిటెడ్ కాల్స్ మరియు 300 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. టెలికాం సంస్థలకు విధించిన గడువు అక్టోబర్ 21 వరకు ఉండగా, ఎయిర్‌టెల్ ముందుగానే ఈ సదుపాయాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

సంబంధిత పోస్ట్