తుఫాన్‌గా బలహీనపడిన ‘అక్వాన్’

19చూసినవారు
తుఫాన్‌గా బలహీనపడిన ‘అక్వాన్’
AP: తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా అక్వాన్ బలహీనపడిందని APSDMA తెలిపింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను బాహ్యవలయం తాకిందని, మరో 2 గంటల్లో పూర్తిగా తీరం దాటే సూచనలు ఉన్నాయని పేర్కొంది. గడిచిన 6 గంటల్లో గంటకు 21 కి.మీ వేగంతో తుఫాన్ ముందుకు కదులుతోందని వెల్లడించింది. ప్రస్తుతానికి ఇది కళింగపట్నానికి 80 కి.మీ, గోపాల్‌పూర్‌కి 130 కి.మీ, విశాఖపట్నానికి 160 కి.మీ,పూరీకి 220 కి.మీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 హెల్ప్‌లైన్ నంబర్లకు సంప్రదించాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్