భువనేశ్వర్లో పానీపూరీ తయారీ కేంద్రంలో అపరిశుభ్రత, కలుషిత ఆహార పదార్థాలు బయటపడ్డాయి. ఖారవేళనగర్లోని ఓ కేంద్రాన్ని బుధవారం వైద్య, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయగా చింతపండు రసంలో పురుగులు, దుంపల మసాలా కూరలో క్రిమికీటకాలు కనిపించాయి. పరిసరాల్లో తీవ్ర దుర్వాసన, పారిశుద్ధ్య లోపాలు ఉన్నట్లు గుర్తించారు. సామగ్రిని సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ పానీపూరీ కేంద్రాలపై సోదాలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. యువత, పిల్లలు పానీపూరీలు తినే ముందు ఒక్కసారి పరిసరాలు, ఆహార సామగ్రి నాణ్యత చూసుకోవాలని అధికారులు తెలిపారు.