ALERT: ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక

8చూసినవారు
ALERT: ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక
AP: అర్నబ్ తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని, మరో గంటన్నరలో యానాం సమీపంలో తీరం దాటనుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ గంటకు 3 కి.మీ వేగంతో కదులుతోంది. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణనష్టం జరగకుండా ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్‌డీఎంఏ అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్