థియేటర్లలోకి రానున్న అల్లరి నరేశ్‌ ‘ఆల్కహాల్’

2చూసినవారు
థియేటర్లలోకి రానున్న అల్లరి నరేశ్‌ ‘ఆల్కహాల్’
హీరో అల్లరి నరేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆల్కహాల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రుహానీ శర్మ, నిహారిక ఎన్ఎం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్