బ్రహ్మానందంను కలిసిన అల్లు అర్జున్.. వైరల్ ఫోటోస్!

1971చూసినవారు
బ్రహ్మానందంను కలిసిన అల్లు అర్జున్.. వైరల్ ఫోటోస్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం స్టార్ కమెడియన్ బ్రహ్మానందంను హైదరాబాద్‌లోని అతని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్‌ వివాహం జరిగింది. సిద్ధార్థ్ వివాహానికి అల్లు అర్జున్ హాజరుకాలేకపోయారు. అందుకే ఈ రోజు ప్రత్యేకంగా ఇంటికి వెళ్లి ఆయన కలిశారు. ఈ సందర్భంగా జాతీయ అవార్డు గెలుచుకున్న అల్లుఅర్జున్‌ను బ్రహ్మానందం అభినందించారు. బ్రహ్మానందం కుటుంబంతో బన్ని దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్