
తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ శుభవార్త.. ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు
దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే పలు ప్రత్యేక రైళ్లను అక్టోబర్, నవంబర్ నెలల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-షాలిమార్, కొయంబత్తూర్-జైపూర్, జోధ్పూర్-చెన్నై సెంట్రల్, కాన్పూర్ సెంట్రల్-బెంగళూరు మధ్య నడిచే ఈ రైళ్లు హైదరాబాద్, కాజీపేట, విజయవాడ, రేణిగుంట, కర్నూలు వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది.




