అల్లు అర్జున్‌ ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు

0చూసినవారు
అల్లు అర్జున్‌ ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'రాకా' సినిమా చిత్రీకరణ దశలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. రియల్ టైమ్‌లో 37 మంది నటుల మోషన్ క్యాప్చర్ చేసి ఈ ఘనత సాధించారు. ఈ చిత్రానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్ అందుకున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మూడు విభిన్న కాలాల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్