
జియో లిస్టింగ్ వేదికపై కన్నీరు పెట్టుకున్న అంబానీ (వీడియో)
రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ స్టాక్ మార్కెట్లో బుధవారం ఘనంగా అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా తన కుమారుడు అనంత్ అంబానీ ప్రసంగం వింటుండగా ముఖేష్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. జియో షేర్లు రూ.1,119 ఇష్యూ ధరతో మొదలై, 21 శాతం ప్రీమియంతో రూ.1,358 వద్ద లిస్టయ్యాయి. రూ.30,213 కోట్లు సమీకరించిన ఈ ఐపీఓ, దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.12.5 లక్షల కోట్లకు చేరి, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజాలను అధిగమించి రెండో స్థానంలో నిలిచింది.




