
దారుణం.. పోలీస్ స్టేషన్లోనే మహిళపై అత్యాచారం
ఝార్ఖండ్‌లోని సెరైకేలా ఖర్సావాన్ జిల్లా గంహారియా పోలీస్ స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై విధుల్లో ఉన్న పోలీస్ అధికారి అర్ధరాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆత్మరక్షణ కోసం బాధితురాలు కత్తితో దాడి చేయడంతో నిందితుడు పారిపోయాడు. మరుసటి రోజు డబ్బు ఆశ చూపి కేసును నీరుగార్చేందుకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన అధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన గదిని సీల్ చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




