చలికాలంలో చర్మ సౌందర్యం కోసం అద్భుతమైన ఇంటి చిట్కా!

162చూసినవారు
చలికాలంలో చర్మ సౌందర్యం కోసం అద్భుతమైన ఇంటి చిట్కా!
చలికాలంలో చర్మం తన సహజమైన కాంతిని, మృదుత్వాన్ని కోల్పోతుంటుంది. ఈ సమస్యను అధిగమించి చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, మూడు చుక్కల నిమ్మరసం, తేనె, కాఫీ పొడి ఒక టేబుల్ స్పూన్ వేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి15 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు  చేస్తే చర్మం మృదువుగా కనిపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్