శరద్ పౌర్ణమి వేళ ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంపై అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయ నీలచక్రం వెనుక నిండుగా వెలిగిన పున్నమి చంద్రుడు భక్తులను మంత్రముగ్ధులను చేశాడు. వెన్నెల కాంతుల్లో మెరిసిన పవిత్ర నీలచక్రం చూపరులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు కలగలిసిన ఈ అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది.