ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈసారి దాదాపు 1000 మంది ఉద్యోగులకు కోత విధించింది. ఈ లేఆఫ్‌లు
భారత్,
అమెరికా, యూకే వంటి పలు దేశాల్లోని సంస్థ రిటైల్ విభాగంపై ప్రభావం చూపాయి. వ్యయ నియంత్రణ, వ్యాపార పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ తెలిపింది. గతంలో కూడా అమెజాన్ పలుమార్లు ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.