ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, ఫౌండేషన్ ఫర్ ఎక్సెలెన్స్ (FFE) భాగస్వామ్యంతో 'అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్షిప్ 2026'ను ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏటా రూ.50 వేల చొప్పున నాలుగేళ్లకు రూ.2 లక్షల సాయంతో పాటు, ల్యాప్టాప్, మెంటార్షిప్, పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్
విద్యార్థులు నవంబర్ 30, 2026లోపు FFE అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెబ్సైట్: https://ffe.org/amazon-future-engineer/