5టన్నుల పేలుడు పదార్థాలను ధ్వంసం చేసిన అమెరికా

38చూసినవారు
5టన్నుల పేలుడు పదార్థాలను ధ్వంసం చేసిన అమెరికా
అమెరికా సైన్యం బుధవారం అయోవాలోని ఒక ఆయుధ కర్మాగారంలో సుమారు ఐదు టన్నుల పాత సైనిక పేలుడు పదార్థాలను విజయవంతంగా పేల్చివేసింది. గత రెండు దశాబ్దాలుగా 68 బారెళ్లలో నిల్వ ఉంచిన ‘లెడ్ అజైడ్’ అనే రసాయనం పాతబడిపోయి, అత్యంత అస్థిరంగా మారి ప్రమాదకరంగా పరిణమించింది. ఎప్పుడైనా పేలిపోయే అవకాశం ఉన్నందున, భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నారు. కాలుష్య ప్రమాదాలు మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని, స్థానిక నివాసితులను ముందుస్తుగా ఖాళీ చేయించి అధికారులు ఈ ధ్వంస కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్