పెళ్లిలో కావ్య కోసం పాట పాడిన అనిరుధ్

9చూసినవారు
సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, కావ్యా మారన్‌ వివాహ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గ్రీస్‌లో జరిగిన ఈ వేడుకలో రజనీకాంత్‌తో పాటు మాజీ సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 21న చెన్నైలో రిసెప్షన్‌ నిర్వహించనున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. తాజాగా అనిరుధ్‌ షేర్‌ చేసిన ఫొటోల్లో కావ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో పాటు, ఆమె కోసం పాట పాడుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. వీటిపై నెటిజన్లు ‘క్యూట్‌ కపుల్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్