అమెరికా ఓటర్‌ డేటాలోకి చొరబడ్డ ఆంథ్రోపిక్‌ క్లాడ్‌

5చూసినవారు
అమెరికా ఓటర్‌ డేటాలోకి చొరబడ్డ ఆంథ్రోపిక్‌ క్లాడ్‌
ఆంథ్రోపిక్‌ సంస్థకు చెందిన క్లాడ్‌ ఏఐ మోడల్‌ అమెరికాలోని జార్జియా రాష్ట్ర ఓటర్ల డేటాను అనధికారికంగా యాక్సెస్‌ చేసినట్లు వెల్లడైంది. ఓట్ల వివరాలు చూసేందుకు ఉన్న పేవాల్‌ను దాటి మొత్తం ఓట్ల సంఖ్యను సేకరించినట్లు సంస్థ తెలిపింది. అయితే ఓటింగ్‌ రికార్డులను కాపీ చేయడం లేదా మార్చడం జరగలేదని స్పష్టం చేసింది. ఘటనను గుర్తించిన వెంటనే చర్యలు తీసుకుని, జార్జియా రాష్ట్ర కార్యదర్శి కార్యాలయానికి, వైట్‌హౌస్‌కు సమాచారం అందించింది. ఏఐ ఏజెంట్లతో సైబర్‌ భద్రతకు ఎదురవుతున్న ముప్పుపై ఈ ఘటన ఆందోళనలు పెంచింది.

సంబంధిత పోస్ట్