ఏపీ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

4చూసినవారు
ఏపీ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
AP: రాష్ట్రంలోని ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మాడి కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీఈసెట్‌, గేట్, జీప్యాట్ అభ్యర్థుల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబరు 16 నుంచి 21 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. 17 నుంచి 22 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 18 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. సెప్టెంబరు 29న సాయంత్రం 6 గంటల తర్వాత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 3 లోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. పూర్తి వివరాలకు cap.apcfss.in వెబ్‌సైట్‌ చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్