ఫేస్‌క్రీమ్‌ రాసుకుంటే.. కిడ్నీలు పాడయ్యాయి

19చూసినవారు
ఫేస్‌క్రీమ్‌ రాసుకుంటే.. కిడ్నీలు పాడయ్యాయి
కేరళలోని మలప్పురం జిల్లాలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఫేస్‌క్రీమ్ వాడి 17 ఏళ్ల బాలిక కిడ్నీ వ్యాధి బారినపడింది. మొటిమలు, నల్లమచ్చలు తగ్గుతాయని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలు చూసి ఆమె క్రీమ్ ఆర్డర్ చేసింది. ఏడాది పాటు వాడిన తర్వాత అనారోగ్యానికి గురైంది. పరీక్షల్లో ఆమె శరీరంలో ప్రమాదకర స్థాయిలో పాదరసం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. క్రీమ్‌లో అనుమతించిన స్థాయి కంటే అధికంగా 12,500 పీపీఎం పాదరసం ఉన్నట్లు వెల్లడించారు. ఘటనపై కేరళ బాలల హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి నివేదిక కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్