అట్టారీ సరిహద్దులో ఏఆర్ రెహమాన్ (వీడియో)

1293చూసినవారు
ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దును సందర్శించి, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) జవాన్లకు ప్రత్యేక సంగీత నివాళి అర్పించారు. సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి గీతాలతో కూడిన తన కొత్త మ్యూజికల్ ప్రాజెక్ట్ ‘మై వాపస్ ఊంగా’లోని ప్రధాన గీతాన్ని సరిహద్దు ప్రాంతంలోనే ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ సైనికుల జీవితాలు, త్యాగాలు, దేశభక్తిని ప్రతిబింబిస్తుంది. రెహమాన్ గతంలో 'రోజా', 'బొంబాయి' చిత్రాలతో పాటు 'వందే మాతరం' ఆల్బమ్ ద్వారా దేశభక్తిని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్