తాటి చెట్టుతో ఇన్ని ఉపయోగాలా?

9చూసినవారు
తాటి చెట్టుతో ఇన్ని ఉపయోగాలా?
తాటి చెట్టు అత్యంత విలువైనది. దీనిని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర చెట్టుగా ప్రకటించింది. భారత ఉపఖండం మూలాలుగా కలిగిన ఈ చెట్టు సుమారు 15-30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. తాటి ఆకులు, మాను, కాయలు, నీరా, తాటి బెల్లం వంటి ప్రతి భాగం మానవాళికి ఎంతో మేలు చేస్తాయి. ప్రాచీన కాలంలో తాటి ఆకులను గ్రంథాల రచనకు ఉపయోగించేవారు. ప్రస్తుతం తాటి బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాటి వనాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత పోస్ట్